Rana-Miheeka: రానా తండ్రి కాబోతున్నాడా?

rana-miheeka

rana-miheeka

Rana-Miheeka: సోషల్ మీడియాలో ఓ వార్త తెగ చక్కర్లు కొడుతోంది. తెలుగు ఇండస్ట్రీకి చెందిన రానా దగ్గుబాటి తండ్రి కాబోతున్నాడా అని. అవును ఈ వార్త ప్రస్తుతం హాట్​టాపిక్​గా మారింది. 2020లో తన బ్యాచ్​లర్ లైఫ్​కు వీడ్కోలు చెప్పేశాడు మన భల్లాలదేవ. కరోనా లాక్​డౌన్​లో సైలెంట్​గా పెళ్లి చేసుకుని అందర్ని షాక్​కు గురిచేశాడు. 2020 ఆగస్టు 8న మిహిక బజాజ్​ను రానా మనువాడాడు. తాను ప్రేమించి మిహకాను వివాహం చేసుకున్నాడు. అప్పటి నుంచి వీరిద్దరూ ఎంతో అన్యోన్యంగా ఉంటున్నారు. తన భార్యపై ఎంతో ప్రేమను చూపించే రానా… పలు షోలల్లో ఆమె నుంచి గురించి, వారిద్దరి అనుబంధం గురించి చాలా చక్కగా చెప్పాడు.

Rana-Miheeka: అయితే ఇదిలా ఉండగా లేటెస్ట్​గా రానా తండ్రి కాబోతున్నాడా అని ఓ క్యూరియాసిటీ నెటిజన్లలో వచ్చింది. అందుకు గల కారణం లేకపోలేదు. టాలీవుడ్​లో ది బెస్ట్ కపుల్ అయిన రానా-మిహికా ఇందుకు జవాబు కూడా ఇచ్చేసింది. ఆన్సర్ చెప్పింది మాత్రం రానా కాదండోయ్. అతడి వైఫ్ మిహికా. మిహికా బజాజ్ సోషల్ బాగా యాక్టివ్​గా ఉంటుంది. తమ ఫ్యామిలీకి సంబంధించి ఫోటోలు, వీడియోలు ఎప్పటికప్పడు పెడుతు ఉంటుంది. దీంతో ఈమె దగ్గుబాటి అభిమానులకు మరింత చేరువయ్యారు. ఇటీవల రానా-మిహికా ఓ ఫ్రెండ్ పెళ్లికి అటెండ్ అయ్యారట. వాటి ఫోటోలు సోషల్ మీడియాలో సందడి చేస్తున్నాయి. వీటిని చూసిన నెటిజన్లు మిహికా బజాజ్ లైవ్​ చాట్​లోకి వచ్చినప్పుడు అడగడం మొదలేట్టేశారు.

అయితే నెజిజన్లు అడిగే ప్రశ్నలకు ముందే ప్రిపేర్ అవుతుంటారు. సెలెబ్రిటీలు లైవ్​ చాట్​లో నెటిజన్లు అడిగే ప్రశ్నలకు ఓపికగా సమాధానం ఇస్తుంటారు రానా వైఫ్ మిహికా బజాజ్. ఈ నేపథ్యంలో ఓ నెటిజన్​ అడిగిన ప్రశ్నకు ఏ మాత్రం కోప్పడకుండా సమాధానం చెప్పేసింది మిహికా. ఫోటోల్లో మిహికా కాస్త బొద్దుగు కనిపించడంతో మీరు ప్రెగ్నెంట్ హా అని అడిగేశాడు. ఈ క్వశ్చన్ అడగడానికి చాలా క్యూరియాసిటీగా ఉందంటూ కమెంట్ చేశాడు. దానికి బదులుగా మిహికా… పెళ్లి అయింది… ఇంకా పిల్లలు కోసం వెయిట్ చేస్తున్నాం అంటూ సమాధానం ఇచ్చింది. దీంతో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న రానా తండ్రి కాబోతున్నాడనే విషయంపై ఓ క్లారిటీ వచ్చినట్లైంది.

Read Also: Fined To Manchu Manoj Car: హీరో మంచు మనోజ్​కు ట్రాఫిక్​ ఫైన్​

Leave a Reply

Your email address will not be published.