Vallabhaneni Janardan: దర్శక నిర్మాత వల్లభనేని జనార్ధన్ కన్నుమూత

tolllywood

Telegu film chamber

Vallabhaneni Janardan : టాలీవుడ్ ఇండస్ట్రీలో వరుస విషాదాలు చోటుచేసుకుంటున్నాయి.. నెలల వ్యవధిలో ప్రముఖులు కన్నుమూశారు. ఇటీవలి కాలంలో అలనాటి లెజెండరీ నటులు కృష్ణంరాజు, కృష్ణ, కైకాల సత్యనారాయణ, చలపతిరావు కన్నుమూశారు. తాజాగా ప్రముఖ దర్శకుడు, నిర్మాత, నటుడు వల్లభనేని జనార్ధన్ రావు (63) మృతిచెందారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఇవాళ ఉదయం 10గంటల తర్వాత తుదిశ్వాస విడిచారు.

Vallabhaneni Janardan : జనార్ధన్ రావు స్వస్థలం పశ్చిమగోదావరి జిల్లా పోతునూరు. 1959 సెప్టెంబర్ లో జన్మించారు. చిన్నతనం నుంచి సినిమాలపై ఆసక్తి. విజయవాడలోని లయోలా కళాశాలలో చదువుకున్నారు. సినిమాలపై ఆసక్తితో సొంతంగా సంస్థను స్ఫాపించి మామ్మగారి మనమలు పేరుతో సినిమా ప్రారంభించారు. కొన్ని కారణాల వల్ల ఆచిత్రం మధ్యలోనే ఆగిపోయింది. ఆ తర్వాత కన్నడలో సూపర్​హిట్ అయిన మానససరోవర్ చిత్రం ఆధారంగా తెలుగులో చంద్రమోహన్ హీరోగా అమాయక చక్రవర్తి సినిమాకు దర్శకత్వం చేపట్టారు. ఆ తర్వాత శోభన్ బాబు హీరోగా హిందీలో బసేరాను తెలుగులో తోడు-నీడగా రూపొందించారు.

ఆయన కుమార్తె శ్వేత పేరుమీదుగా అంతర్జాతీయ సంస్థను స్థాపించి శ్రీమతి కావాలి, పారిపోయిన ఖైదీలు వంచి చిత్రాలు నిర్మించారు. అంతే కాకుండా శ్రీమతి కావాలి చిత్రంతో తాను నటుడిగా అరంగ్రేట్రం చేశారు. ఆయన మామ విజయబాపినీడుతో కలసి మహాజనానికి మరదలు పిల్ల చిత్రంలో పాటు రవితేజ హీరోగా ఎంట్రీ ఇచ్చిన నీకోసం మూవీకి నిర్మాణ సారథ్యం వహించారు. సుమారు 100కి పైగా చిత్రాల్లో ఆయన నటించారు. సినిమాలతో పాటు సీరియల్స్​లోను నటించి ప్రేక్షకుల మన్ననలు పొందారు.

వివాహం.. పిల్లలు
ప్రముఖ దర్శకుడు, నిర్మాత అయిన విజయబాపినీడు మూడో కుమార్తె లళినీ చౌదరిని ఆయన వివాహం చేసుకున్నారు. వీరికి ఇద్దరు కుమార్తెలు, కుమారుడు. పెద్దమ్మాయి శ్వేత చిన్నవయసులోనే మృతి చెందింది. రెండో కుమార్తె ఫ్యాషన్ డిజైనర్ కాగా.. కుమారుడు అవినాశ్ అమెరికాలో సాఫ్ట్వేర్ ఇంజినీర్​గా పనిచేస్తున్నాడు. జనార్ధన్ మృతితో టాలీవుడ్ లో విషాదం నెలకొంది. ఆయన మృతికి సిని ప్రముఖులు నివాళి అర్పిస్తున్నారు.

Read also : Love Story: అలా అయితే అది ప్రేమెలా అవుతుంది?

Leave a Reply

Your email address will not be published.