Liger Movie Censor Completed : లైగర్ కు షాకిచ్చిన సెన్సార్ బోర్డు..

Liger Movie Censor Completed : మాస్ డైరెక్టర్ పూరీ, రౌడీ హీరో విజయ్ దేవరకొండ కాంబినేషన్లో వస్తున్న ఫాన్ ఇండియా చింత్రం లైగర్‌పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రాన్ని ఆగస్టు 25న ప్రపంచ వ్యాప్తంగా భారీ రేంజ్లో విడుదల చేసేందుకు చిత్రబృందం సిద్దమైంది. కాగా ఈ చిత్రానికి సంబంధించి సెన్సార్ బోర్డు షాకిచ్చింది. ఈ మూవీలో పలు అభ్యంతరకరమైన సన్నివేశాలు ఉన్నాయని వాటిని తొలగించాల్సిందిగా ఆదేశించింది. అలాంటి సన్నివేశాలు మొత్తం 7 ఉన్నట్లుగా గుర్తించింది. మూవీని చూసిన సెన్సార్ బోర్డు చిత్రానికి యూ/ఏ సర్టిఫికెట్‌ను జారీచేసింది. సెన్సార్ బోర్డు సూచనలతో ఆ సీన్లు తొలగించే పనిలో దర్శక నిర్మాతలు నిమగ్నమయ్యారు.
Liger Movie Censor Completed : రామ్‌తో ఇస్మార్ట్ శంకర్‌తో భారీ విజయం అందుకున్న పూరీ ఈ చిత్రంపై భారీ ఆశలు పెట్టుకున్నారు. ఈ చిత్రంలో విజయ్ దేవరకొండ బాక్సర్‌గా కనిపించనున్నారు. విజయ్సరసన బాలీవుడ్ బామ అనన్య పాండే సందడి చేయనుంది. అందే కాకుండా ఈ చిత్రంలో మైక్ టైసన్ నటించడంతో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ మూవీలో రమ్యకృష్ణ కీలక పాత్రలో కనిపించనుంది. ఇప్పటికే రిలీజైన పాటలు, టీజర్ భారీ అంచనాలు రేపుతున్నాయి. మరోవైపు చిత్రబృందం పబ్లిసిటీలో నిమగ్నమైంది. ఆగస్టు 25న తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళం భాషల్లో విడుదల కానుంది.
డ్యూరేషన్ ఎంతంటే..
సెన్సార్ పూర్తి చేసుకున్న లైగర్ చిత్రం.. 2గంటల 20 నిమిషాల నిడివి ఉంది. ఈ చిత్రంలో ఆఖరి ఫైట్ ఎంతగానో ఆకట్టుకుంటుందని పూరీ ఇప్పటికే చెప్పారు. ఈచిత్రాన్ని వెండి తెరపై చూడాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే..