Pawan Kalyan Helps To Farmers: సూసైడ్ చేసుకున్న రైతులకు పవన్ ఆర్థికసాయం

Janasena Protest
Pawan Kalyan Helps To Farmers: ఆంధ్రప్రదేశ్‌లో అప్పుల బాధ తాళలేక ఆత్మహత్యలకు పాల్పడిన రైతన్న కుటుంబాలకు అండగా నిలిచారు జనసేనాని పవన్ కల్యాణ్. అప్పులు తీర్చలేక బలవన్మరణాలకు పాల్పడిన రైతుల చూసి తన మనసు కలచివేసిందని పవన్ పేర్కొన్నారు. ఈ మేరకు సోషల్ మీడియాలో వీడియో రిలీజ్ చేశారు. ప్రాణాలు కోల్పోయిన రైతు కుటుంబాలకు తమ వంతుగా ఒక్కో కుటుంబానికి రూ. లక్ష ఆర్థిక సాయం అందిస్తామని పవన్ ప్రకటించారు. ఆ మొత్తాన్ని తానే స్వయంగా వెళ్లి అందిస్తానని మాటిచ్చారు.
రాష్ట్రంలో రైతులు, కౌలు రైతులు పంట నష్టాల..అప్పుల భారంతో ఆత్మహత్యలు చేసుకోవడం అత్యంత బాధాకరం. అన్నపూర్ణలాంటి గోదావరి జిల్లాల్లోనే 80కి పైగా రైతులు ఆత్మహత్యలు చేసుకొన్నారు. ఆ రైతు కుటుంబాలలోని పిల్లల చదువులకు, ఇతర అవసరాలకు కొంతైనా అండ ఇవ్వాలనే రూ.లక్ష సాయం చేస్తున్నాం. త్వరలోనే ప్రతి కుటుంబాన్నీ పరామర్శిస్తాను. ఆర్థిక సాయం అందించే ప్రక్రియ కూడా మొదలవుతుంది. మనం ఈ రోజు తినే తిండి గింజల్లో 80శాతం కౌలు రైతుల కాయకష్టం వల్ల పండినవే. అలాంటి కౌలు రైతుల బాధల గురించి తెలుసుకొంటుంటే హృదయం ద్రవిస్తుంది. కౌలు రైతుకు నిబంధనల పేరుతో ప్రభుత్వం నుంచి ఎలాంటి సహాయం అందటంలేదు.సాగు చేసుకొంటే రుణం ఇవ్వరు.పంట నష్టపోతే పరిహారం ఇవ్వరు. ఆత్మహత్య చేసుకున్నవారికీ ఆర్థిక సాయం అందించడంలేదు. కనీసం అధికారులు కూడా పరామర్శించి విచారించరు.
— పవన్ కల్యాణ్, జనసేన చీఫ్
Pawan Kalyan Helps To Farmers: మొదటగా ఆ జిల్లాల్లోనే: ఫస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్స్‌లోని 80 కుటుంబాలకు, తర్వాత కర్నూల్, అనంతపురం జిల్లాల్లో సూసైడ్ చేసుకున్న 150 మంది రైతులకు ఆర్థికసాయం అందిస్తామన్నారు. రైతులు రక్తం ధారపోస్తేనే ఆంధ్రప్రదేశ్ అన్నపూర్ణగా మారిందన్నారు. వారికి రాష్ట్ర ప్రభుత్వం ఆత్మహత్యలను గిఫ్ట్‌లుగా ఇచ్చిందన్నారు. స్టేట్‌లో 16 లక్షల మంది కౌలు రైతులున్నారన్న ఆయన… అసలు విషయానికొస్తే వారి సంఖ్య 45 లక్షలు ఉండే అవకాశముందన్నారు. వారి ఆత్మహత్యలు చేసుకుంటే ఎవరు పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైకాపా రైతులను మోసం చేసిందన్నారు.