Youtube Channels Blocked : యాంటీ భారత్ యూట్యూబ్ ఛానెళ్లు బ్లాక్

youtube
Youtube Channels Blocked : దేశంపై తప్పుడు ప్రచారం, వ్యతిరక వార్తలను ప్రసారం చేస్తున్న యూట్యూబ్ ఛానళ్లపై కేంద్రం కొరఢా ఝుళిపించింది. అలాంటి ఎనిమిది యూట్యూబ్ ఛానళ్లపై కేంద్రం తాజాగా నిషేధం విధించింది. వాటిలో 7 ఛానళ్లు భారత్కు చెందినవి కాగా.. మరొకటి పాకిస్తాన్కు చెందినది. ఈ విధంగా భారత్కు వ్యతిరేకంగా వార్తలను ప్రసారం చేసి నిషేధానికి గురైన యూట్యూబ్ ఛానళ్ల సంఖ్య 102కు చేరింది. భారత్కు వ్యతిరేకంగా వార్తలు ప్రసారం చేస్తున్న ఓ ఫేస్బుక్ ఖాతాను ఐటీ నిబంధనలు 2021 ప్రకారం నిషేధించినట్లు ప్రసారశాఖ ప్రకటనలో తెలిపింది. తాజాగా నిషేదానికి గురైన 8 యూట్యూబ్ ఛానళ్లకు సుమారు 86 లక్షల మంది సబ్స్క్రైబర్లు, 114 కోట్లకు పైగా వ్యూస్ ఉన్నట్లు సమాచారం.