Love Story: అలా అయితే అది ప్రేమెలా అవుతుంది?

love
Love Story: ప్రేమ దీని గురించి ఇప్పుడొస్తున్న కొత్త కవులు, రచయితలు కొత్తగా చెప్పాల్సిన పని ఏం లేదు. దాని గురించి ఎవరు చెప్పినా… ఎలా చెప్పినా అద్భుతంగానే అనిపిస్తుంది. ఎవరెన్ని చెప్పినా… దానిని అనుభవించిన వారి దృష్టిలో అది మరోలా ప్రతిబింబిస్తుంది. మొదట్లో ఎంతో అపురూపంగా అనిపించే ప్రేమ రాను రాను కాస్త తగ్గుతూ వస్తోందంటారు. ఇది నిజమని కొందరంటే… హిమాలయాలు అయినా కరుగుతాయేమో కానీ ప్రేమ మాత్రం ఎప్పటికీ తగ్గదని మరికొందరి వాదన. నిజానికి ఈ థియరీస్పై చాలా సినిమాలు, నవలలు, గ్రంథాలు, కవితలు వగైరా వగైరా చాలానే వచ్చాయి. కానీ అందులో వారికి తెలిసింది… వారు చెప్పాలనుకున్నది వారు స్పష్టంగా చెప్పారు.
అసలు ప్రేమనేది ఉందా…? ఉంటే ఎన్ని రోజులు ఉంటుంది. ఎన్ని రోజులు ఉంటే నిజమైన ప్రేమ? కొన్నాళ్లు ఉండి తర్వాత క్రమంగా తగ్గుతూ ఉంటే అది ప్రేమా? లేక వ్యక్తిపై ఆకర్షణా? శారీరక అవసరాల కోసం ప్రేమను సాధనంగా వాడుకుంటున్నారా? ఇటువంటి ప్రశ్నలు ఎన్నో ఎదురువుతున్నాయి. వాస్తవానికి ఈ రోజుల్లో నిజమైన ప్రేమ అనేది చాలా అరుదనే చెప్పుకోవాలి. ఎందుకంటే ఈ మధ్య కాలంలో చూస్తున్న ప్రేమల్లో శారీరక అవసరాల కోసం ఏర్పడినవే అనేకం. అలాంటి వాటిలో యాధృచ్చికంగానే మొదట్లో అవుతలి వ్యక్తిని ఇంప్రెస్ చేయడానికి నానా పాట్లు పడతారు. ఎలాగైనా… సరే అనుకున్న దానిని చేజిక్కుంచుకోవాలని ఆరాటపడతారు. ఇలాంటి కేసుల్లో కూడా ప్రేమ అనేది ప్రధాన ఆయుధం.
ఎవరో ఓ ఆధునిక కవి ఇలా అన్నాడు…
ఆ రోజుల్లో ప్రేమ అనేది… ముందుగా పరిచయం.. మాటామంతీ.. తర్వాత ప్రేమను వ్యక్తపరుచుకోవడం… ఆ తర్వాత ఇంట్లో పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకోవడం.. చివరకు శృంగారం.. ఈ ప్రేమ వారు చనిపోయే వరకు ఉండేదని చెప్పుకొచ్చాడు.
కానీ ఇప్పటి ప్రేమలో
ముందుగా పరిచయం… తర్వాత డేటింగ్… ఆ తర్వాత శృంగారం… అప్పుడు వారి మధ్యలో ప్రేమ పుడితే ఓకే లేదంటే నువ్వు నీ దారి చూస్కో… నేను దారి చూసుకుంటా. ప్రస్తుత ప్రేమల్లో చాలా వరకు ఇదే తీరని చెప్పుకొచ్చాడు.
Love Story: నిజానికి ఆయన చెప్పిన దాంట్లో పెద్దగా తప్పు ఏం అనిపించలేదు. అదే కరెక్ట్ కూడా అనిపించింది. అందరి ప్రేమలు అలా ఉండకపోయినా… చాలా వరకు అలానే ఉంటున్నాయనే దానిలో ఎలాంటి సందేహం లేదు.
ఒకవేళ నిజంగా ప్రేమించుకుంటున్నా… ఇద్దరి మధ్యలో సఖ్యత కొరవడుతోంది. మొదట్లో ఎంతో అద్భుతంగా అనిపించే ప్రేమ రానురాను క్రమంగా తగ్గిపోతోంది. ఎందుకని కారణాలు వెతికితే… చాలానే బయటపడ్డాయి. ఇద్దరు వ్యక్తుల్లో ఒకరు మాత్రం చాలా సిన్సియర్‌గా ఉంటారు. మరొకరు మాత్రం ఆ రేంజ్లో ఉండరు. అలాంటపుడు సమస్యలు ఎదురవుతాయి. మరికొంత మంది లైఫ్, ఫ్యాషన్ అని చెప్పి… తనకు ప్రియారిటీ ఇస్తున్న వ్యక్తినే మర్చిపోతారు. ఆశ్చర్యం కలిగించే విషయం ఏంటంటే… నీకై పరితపించే వ్యక్తిని కాదనడం ఎంతవరకు సమంజసం. ఎవరికైనా గోల్స్ ఉంటాయి. వారి వారి ఫ్యాషన్… వర్క్ ఇలా అన్ని ఉంటాయి. కానీ నిన్ను ఇష్టపడుతున్న వ్యక్తిని కలుపుకుని ఆ దిశగా వెళ్తే రెండింటిలోనూ విజయం సాధిస్తారనేది మర్చిపోతారు. ఇలా కాకుండా ఏదో నా ఫ్యాషన్ అని ఏదేదో చెప్పి నెగ్లెట్ చేస్తారు. ఎదుటి వ్యక్తి మనసు విరిగిన తర్వాత తిరిగి వచ్చినా లాభం ఉండదు.
ఇక్కడ ప్రధాన సమస్య ఏంటంటే నీకోసం వేచి చూసే వ్యక్తికి నువ్వు సమయం కేటాయించకపోవడమే. రోజులో ప్రేమగా నువ్వు మాట్లాడే నాలుగు మాటలే వారికి ఎంతో ఎనర్జీనిస్తాయి. ఆ రోజంతా ఉత్సాహంగా పనిచేసేందుకు సరిపడా శక్తిని పొందుతారు. చాలా మందిలో కొరవడుతున్న సమస్య ఇదే. టైం లేదు టైం లేదు అంటుంటారు. టైం ఎవరికి ఎక్స్ట్రా ఉండదు. దాన్ని మనం ఎలా వాడుకుంటున్నామనేదే ఇంపార్ట్టెంట్. మొదట్లో ఎంతో టైం ఉంటుంది. గంటలు గంటలు ఫోన్లోనే ఉంటారు. కానీ రానురాను మాట్లాడటానికి పర్మిషన్ తీసుకునే స్థాయికి వెళతారు. ఎక్కడ లోపం ఉందనేది అర్థం చేసుకోరు. ఉవ్వెత్తున ఎగిసిన ప్రేమ అమాంతం అలా నేలకొరిగిపోకూడదు.
ఒక వ్యక్తిపై మొదట్లో కలిగిన ఫీలింగ్ రానురాను తగ్గిపోతూ ఉందంటే అది ప్రేమే కాదు. నా దృష్టిలో ప్రేమంటే తరగనిది… అది ఎంత రుచి చూసినా తియ్యగానే అనిపించాలి. ఎంత టైం అయినా పెరుగుతూపోతుండాలి. వ్యక్తిని మొదటిసారి చూసినపుడు కలిగిన ఫీలింగ్… అలా పెరుగుతూనే ఉండాలి. ప్రేమ అంటే పెరిగేదే… ప్రేమ అంటే తగ్గేదేలే!
Read More: కలలే నిజమై… వరంలా దొరికిన చెలి… నా వశమైతే