గుండెపోటుతో యువ హీరో మృతి

టాలీవుడ్లో విషాదం నెలకొంది. క్యారెక్టర్ ఆర్టిస్ట్, హీరో సత్య గుండెపోటుతో ఆకస్మికంగా మృతిచెందారు. గురువారం సాయంత్రం గుండెపోటు రావడంతో కుటుంబ సభ్యులు వెంటనే హాస్పిటల్‌కు తరలించారు. చికిత్స పొందుతూ హీరో సత్య మరణించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. క్యారెక్టర్ ఆర్టిస్టుగా కెరీర్‌ను ప్రారంభించిన సత్య.. వరం సినిమాతో పరిచయమయ్యారు. పెద్దగా విజయవంతం కాలేదు. తర్వాత బ్యాచిలర్స్ మూవీతో మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకున్నా.. ఫలితం రాలేదు. దీంతో సినిమాలకు గుడ్‌బై చెప్పి.. వ్యాపారంపై దృష్టిపెట్టారు. అయితే గతేడాది సత్య భార్య, తల్లి మరణించారు. దీంతో తీవ్ర మానసిక క్షోభకు గురయ్యారు. అప్పటి నుంచి అనారోగ్యం పూర్తిగా దెబ్బతింది. హీరో సత్యకు ఎనిమిదేళ్ల కుమార్తె ఉంది.