Fined To Manchu Manoj Car: హీరో మంచు మనోజ్​కు ట్రాఫిక్​ ఫైన్​

Fined To Manchu Manoj Car: ప్రముఖ సినీ హీరో మంచు మనోజ్​కు హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ఫైన్ వేశారు. ఇవాళ ఆయన ప్రయాణిస్తున్న కారుకు ట్రాఫిక్ పోలీసులు చలాన్ విధించారు. మనోజ్ కారుకు 700 రూపాయల చలాన్ విధించారు. టోలీచౌకి ట్రాఫిక్ సిబ్బంది తనిఖీలు చేస్తున్న సమయంలో మంగళవారం పిల్లర్ నెంబర్ 105 వద్ద బ్లాక్ ఫిలింతో AP 39 HP 0319 వాహనాన్ని గమనించి వాహనాన్ని ఆపగా అందులో సినీ హీరో మంచు మనోజ్ ప్రయాణిస్తున్నట్లు ట్రాఫిక్ పోలీసులు గమనించారు. సదరు వాహనంపై రూ. 700 చలాన్ విధించి బ్లాక్ ఫ్రేమ్​ను తొలగించారు.

ట్రాఫిక్ రూల్స్​పై దృష్టి సారించిన హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ఇటీవల తనిఖీలు ముమ్మరం చేశారు. రీసెంట్​గా ప్రముఖ హీరోల కార్లకు ఉన్న బ్లాక్ ఫిలింలను తొలగించారు. హీరో అల్లుఅర్జున్, కల్యాణ్ రామ్ కార్లకు ఉన్న బ్లాక్ ఫిలింలను తొలగించి ఫైన్ వేసిన సంగతి తెలిసిందే.

Leave a Reply

Your email address will not be published.