పదేళ్ల బాలిక అదృశ్యం… చెరువులో మృతదేహం

murder

murder

Medchal girl :తెలంగాణలోని మేడ్చల్​ జిల్లాలో అదృశ్యమైన 10 సంవత్సరాల చిన్నారి ఘటన తీవ్ర విషాదాంతమైంది. గురువారం స్కూల్​కు వెళ్లిన చిన్నారి.. శుక్రవారం అనుమానాస్పద స్థితిలో మరణించింది. చిన్నారి మృతదేహాన్ని దమ్మాయిగూడలోని అంబేడ్కర్ చెరువులో గుర్తించారు. అయితే చిన్నారిని ఎవరైనా హత్యచేశారా లేక ప్రమాదవశాత్తు మరణించిందా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.


Medchal girl : ఎన్టీఆర్​ నగర్​కు చెందిన ఇందు నాలుగో తరగతి చదువుతోంది. గురువారం ఆమె తండ్రి స్కూల్​ వద్ద విడిచిపెచ్చి వెళ్లారు. అయితే కాసేపటికే బాలిక అదృశ్యం అయింది. బ్యాగ్​ను స్కూల్​లోనే విడిచిపెట్టి పక్కనే ఉన్న పార్క్ వద్దకు వెళ్లినట్లు తోటి విద్యార్థులు టీచర్​కు తెలిపారు. వెంటనే తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు స్కూల్​ పరిసరాల్లో తీవ్రంగా గాలించారు. సమీపంలోని సీసీ కెమెరాలను పరిశీలించగా… చిన్నారి రోడ్డుపై వెళ్తున్న దృశ్యాలు కనిపించాయి. దాని ఆధారంగా దర్యాప్తు చేపట్టగా.. సమీపంలోని దమ్మాయిగూడ చెరువులో చిన్నారి మృతదేహాన్ని గుర్తించారు.

Leave a Reply

Your email address will not be published.