Covid XE Variant Found In Gujarat: గుజరాత్‌లో XE వేరియంట్ కేసు నమోదు

Covid XE Variant Found In Gujarat: ఇప్పుడిప్పుడే కరోనా మహమ్మారి నుంచి దేశం కోలుకుంటోంది. ఇంతలోనే మరో వేరియంట్ అంటూ ప్రజల్ని మళ్లీ భయపెడుతోంది కొవిడ్. దేశంలో కరోనా మహమ్మారి అదుపులోకి వస్తోన్న వేళ… అధిక సాంక్రమిక రకంగా చెబుతున్న కొత్త వేరియంట్ ‘’XE’ కలవరం రేపుతోంది. ఇటీవల ముంబైలో… ఈ రకం కేసు బయటపడినట్లు వార్తలు వచ్చినా… కేంద్ర ఆరోగ్యశాఖ తోసిపుచ్చింది. తాజాగా గుజరాత్‌లో తొలి ఒమిక్రాన్ ‘ఎక్స్‌ఈ’ కేసు నమోదైంది. ముంబై శాంతా క్రుజ్‌కు చెందిన వ్యక్తి భార్యతో కలిసి వడోదర వెళ్లారు. మార్చి 12న ఆయనకు కరోనా సోకింది. వారం రోజుల్లోనే ఆయనకి తగ్గిపోగా… తిరిగి ముంబయి వెళ్లిపోయారు.
Covid XE Variant Found In Gujarat: అప్పుడే ఆయన నమూనాలను జీనోమ్ సీక్వెన్సింగ్‌కు పంపగా… శుక్రవారం రిపోర్టు వచ్చింది. ఆయనకు XE వేరియంట్ సోకినట్లు వడోదర మున్సిపల్ కార్పొరేషన్ ఆరోగ్యశాఖ అధికారి దేవేశ్ పటేల్ చెప్పారు. సదరు వ్యక్తి వడోదరలో ఉన్నప్పుడు హోటల్‌లో ఉన్నారని… స్థానికంగా ఉండే బంధువుల చిరునామా ఇచ్చారని చెప్పారు. వారికి సమాచారం ఇచ్చామని ఆయన పరిస్థితి ఇప్పుడు ఎలా ఉందో తెలియదని… దేవేశ్ వివరించారు. ఒమిక్రాన్ ఉపరకాలు BA.1, BA.2 కలిసి XE వేరియంట్‌గా.. రూపాంతరం చెందాయి. తొలిసారి యూకేలో బయటపడిన ఈ వేరియంట్…. తర్వాత పలు దేశాలకు వ్యాపించింది. ఇది ఒమిక్రాన్ కంటే 10 రెట్లు ఎక్కువగా వ్యాపిస్తుందని చెప్పిన నిపుణులు… ప్రాణాంతక లక్షణాలు మాత్రం ఉండకపోవచ్చని అంచనా వేస్తున్నారు.